చెరుకు పంటకు రూ.3 వేలు మద్దతు ధర కల్పించాలి

ఏపీ అసెంబ్లీ: చెరుకు పంటకు రూ.3 వేలు మద్దతు ధర కల్పించాలని ఎమ్మెల్యే కంబాల జోగులు డిమాండ్‌ చేశారు. శనివారం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో బాధపడుతున్నారు. రైతులను పట్టించుకోలేని దుస్థితి నెలకొంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చెరుకు పంటకు టన్నుకు రూ.2300 ఇస్తున్నారు. ఈ ధర గిట్టుబాటు కావడం లేదు. కనీసం పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదు. చెరుకుకు రూ.3 వేలు మద్దతు ధర కల్పించాలి. వరికి కూడా రూ.1000 నుంచి రూ.1500లకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాం. దీనికోసం ఈ రోజు మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. అయితే చర్చ లేకుండా సభను వాయిదా వేశారు. టమోట ధర కిలో రెండు రూపాయలు అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో రైతు ఎలా పంటలు పండిస్తారు. ప్రభుత్వం ఒక ఆలోచనతో ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలి.

Back to Top