ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ప్ర‌భుత్వం

 నెల్లూరు:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలన అవినీతి మయం, కుటుంబ పాలన, ప్రజలను మోసం చేయడమేనని  ఆయ‌న విమర్శించారు.  శనివారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ..  చంద్ర‌బాబు ప్రజల డబ్బుతో రాజకీయ ప్రయోజనాల కోసమే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రుల హక్కుల వంచన విధానాలకు చంద్రబాబు వారథి అన్నారు. నాలుగేళ్లుగా అమిత్‌ షా స్క్రిఫ్ట్‌, మోదీ భజన చేసింది తండ్రి, కొడుకులే అన్నారు. జన్మభూమి కమిటీలు, సాధికార మిత్రుల చేతిలోకి అభివృద్ధి పథకాలు వెళ్లాయని, అర్హులకు పథకాలు అందడం లేదని తెలిపారు. చంద్రబాబు రంగుల మార్పిడితో ఊసరవెల్లి కూడా భయపడుతుందన్నారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉండటానికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కారణమన్నారు.  

 

Back to Top