నోటీసులను రాజకీయ లబ్ధికి వాడుకుంటారా?

న్యాయవ్యవస్థలను చంద్రబాబు కించపరుస్తున్నాడు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు: కోర్టు నుంచి వచ్చిన నోటీసులను కూడా రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్న నీచమైన వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సానుభూతి కోసం చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థను టీడీపీ నేతలు కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు వైయస్‌ జగన్‌కు అనుకూలంగా వస్తుండటంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టిందన్నారు. 2013 నుంచి 13 సార్లు మహారాష్ట్ర కోర్టు సమన్లు జారీ చేస్తూనే ఉందని వెల్లడించారు. ఇప్పటి వరకు 33 సార్లు ఇదే కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారని చెప్పారు. బీజేపీతో కలిసి ఉన్నపుడు వారెంట్‌ వస్తే అప్పుడు మభ్యపెట్టాడని, ఇప్పుడేమో నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ ఇస్తే కుట్ర చేసిందని వైయస్‌ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తనపై కేసు వేసి కోర్టుకు వెళ్లాడు..అదే వ్యక్తి చట్టానికి వ్యతిరేకంగా ధర్నా చేసి చట్టాలపై ఆరోపణలు చేస్తాడని ఆరోపించారు. ఆపరేషన్‌ గరుడ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసు పెట్టాలంటే చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 
 
Back to Top