అవినీతిపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటా

 

నెల్లూరు: అవినీతిపై పోరాటం కొనసాగిస్తునే ఉంటానని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్‌పై నేనెలాంటి విమర్శలు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కలెక్టర్‌ను కోరానని చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతిపై ప్రశ్నిస్తే ఉద్యోగులకు ఉలుకెందుకని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ అవినీతిపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు.
 
Back to Top