సిలికా గనులు కొట్టేసేందుకు సోమిరెడ్డి కుట్ర

నెల్లూరు: మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో సిలికా గనులు కొట్టేసేందుకు కుట్ర పన్నుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  టీడీపీ మినీ మహానాడులో మంత్రి సోమిరెడ్డిపై టీడీపీ నేతలే అవినీతి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కోట, చిల్లకూరు మండలాల్లో 2200 ఎకరాల్లో సిలికా గనులను కొట్టేసేందుకు సోమిరెడ్డి రంగం సిద్ధం చేశారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి మంత్రిగా ఉంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సిలికా గనులతో సోమిరెడ్డికి సంబంధం లేకపోతే రద్దు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నీరు–చెట్టు పేరుతో ఒకే పనికి మూడు బిల్లులు పెడుతున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డికి దమ్ముంటే మా ఆరోపణలపై విచారణ చేయించాలని సవాల్‌ విసిరారు. 
 
Back to Top