వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే జీవితాల్లో వెలుగులు

కొత్తపేట: నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనతో నరకయాతన పడిన ప్రజలు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. రైతులు, మహిళలు, యువత ప్రజా సంకల్పయాత్రకు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను వైయస్‌ జగన్‌ నవరత్నాల ద్వారా తీసుకువస్తున్నారన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న వైయస్‌ జగన్‌ను చూసి ప్రజలంతా మీటింగ్‌లకు ఏర్పాట్లు చేయకపోయినా పర్వాలేదు.. మేము వస్తామని ఫోన్‌లు చేసి మరీ చెబుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ రాకతో తమ జీవితాలు బాగుపడతాయని రావులపాలెం ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఇప్పటికే రావులపాలెం కూడళ్లు జననేత ఫ్లెక్సీలతో నిండిపోయాయన్నారు. 
Back to Top