చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

విజయవాడ: ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల మాదిరిగా రాజీనామాలు చేయాలని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో ఎక్కడ వైయస్‌ఆర్‌సీపీకి క్రెడిట్‌ వస్తోందోనని టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీకి దమ్ముంటే రాజ్యసభలోని పుటేజ్‌ను చూపించాలని సవాల్‌ విసిరారు. నాడు ఓటుకు నోటు కేసులో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు. మహిళా తహశీల్దార్‌ వనజాక్షి జుట్టు పట్టుకొని దాడి చేశారన్నారు. నారా లోకేష్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారని, దమ్ముంటే మీ అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. మీకు దమ్ముంటే రాజ్యసభలో సీసీ పుటేజ్‌ను బయటకు తీయాలన్నారు. విజయసాయిరెడ్డి ఎక్కడా కూడా తలవంచే కార్యక్రమం చేయలేదన్నారు. అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకి అయ్యారని, ఇప్పటికైనా వైయస్‌ఆర్‌సీపీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. మీ ఎంపీలు చరిత్ర హీనులు కాకుండా పార్లమెంట్లో పోరాటం చేయాలన్నారు. ఏపీ ప్రజల పోరాటానికి ఇతర రాష్ట్రాల వారు మద్దతుగా నిలుస్తున్నారని, టీడీపీ ఎందుకు మద్దతు తెలపడం లేదని ప్రశ్నించారు.
 

తాజా ఫోటోలు

Back to Top