విప‌క్ష ఎమ్మెల్యేలంటే చుల‌క‌న‌..!


చిత్తూరు) చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రూపంలో అవ‌మానం క‌లిగింది. ఇంకా చెప్పాలంటే ఏకంగా మ‌ద‌న‌ప‌ల్లె నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు అంద‌రినీ అవ‌మానించారు. నియోజ‌క వర్గ స‌మ‌స్యల మీద ఎమ్మెల్యే ఇచ్చిన విన‌తిప‌త్రాన్ని నేల‌పాలు చేశారు. 
చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ముఖ్య‌మంత్రిని స్థానిక ఎమ్మెల్యేగా దేశాయ్ తిప్పారెడ్డి క‌లిశారు. ప‌ర్య‌ట‌న హడావుడిలో ఉన్న సీఎంను హెలిప్యాడ్ ద‌గ్గ‌ర దొర‌క‌పుచ్చుకొని 13 పేజీల విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల్ని ఆదుకోవాల‌ని కోరారు. త‌ర్వాత‌ ఎమ్మెల్యే ఇత‌ర నాయ‌కులు వెనుదిరిగారు. అయితే కొంత స‌మ‌యం త‌ర్వాత సీఎం హెలిక్యాప్ట‌ర్ బ‌య‌లుదేరాక‌, అదే ప్రాంతంలో ఎమ్మెల్యే ఇచ్చిన విన‌తి పత్రాలు నేల మీద ప‌డి ఉండ‌టాన్ని స్థానికులు గ‌మ‌నించారు. పాత్రికేయుల‌కు స‌మాచారం అందించారు. వారి ద్వారా ఎమ్మెల్యేకు తెలిసింది. దీని మీద ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  
 ప్రజాస్వామ్యం అపహాస్యం-తిప్పారెడ్డి
 ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి ఇచ్చే గౌరవం ఇదేనా? నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు వినతిపత్రం అందజేస్తే హెలిప్యాడ్ వద్దే పడవేయడం చూస్తే ఇక ఆయన నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారన్న సందేహం కలుగుతోంది. కేవలం ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేనన్న కక్ష సాధింపుతోనే ఇలా చేశారు. ఈ చర్య నియోజకవర్గంలోని 4 లక్షల మంది ప్రజలను అవమానించినట్లే. ప్రజాప్రతినిధి, ప్రజల మనోభావాలను అవహేళన చేసిన ఆయనపై గౌరవం పోయింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి.  

Back to Top