పిచ్చిపట్టినవాడిలా మాట్లాడుతున్న చంద్రబాబు

  • మైక్‌ కట్‌ చేసి సీఎం దళిత ఎమ్మెల్యేని కించపరిచారు
  • నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిస్తా...
  • నిధులు అడిగితే పార్టీలో చేరుతారా అని సీఎం అడుగుతున్నారు
  • ఇప్పటికీ ఎమ్మెల్యేలకు బేరాలు పెడుతున్న చంద్రబాబు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య
హైదరాబాద్‌: నందికొట్కూర్‌ లో జరిగిన సమావేశంలో తన మైక్‌ కట్‌ చేయించి సీఎం చంద్రబాబు తనను అవమానపరిచాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎంత అవమానాలకు గురి చేసినా తన నియోజకవర్గ ప్రజల కోసం భరిస్తానని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఐజయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాయలసీమ రైతులను భాగస్వామ్యులను చేసుకొని జాయింట్‌ వెంచర్‌ పెట్టుకోవచ్చు కదా అని చంద్రబాబును నిలదీస్తే అవి మీకు చెప్పనక్కర్లేదు.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి నిరోధకులు అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జైన్‌ ఇరిగేషన్‌ సంస్థ  వల్ల ఏం లాభం లేదని, కేవలం ఆ యాజమాన్యానికి లాభాలు వస్తాయన్నారు. దానికి ఎంత భూమి కేటాయించారో తెలియదన్నారు. మైక్‌ ఇచ్చినప్పుడు స్వప్రయోజనాల కోసం అడుక్కోండి ఇస్తాం అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. అంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడుక్కోవాలా... అని నిలదీశారు. 

అందరికీ సమాన నిధులిచ్చింది వైయస్‌ఆరే..
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు అడిగినా.. అడగకపోయినా అందరికీ సమానంగా నిధులు మంజూరు చేశారని ఐజయ్య గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం చంద్రబాబు దగ్గరకు వెళితే.. మా పార్టీలో చేరుతారా.. పార్టీలో చేరితే అన్ని ఇస్తానంటూ మాట్లాడుతున్నాడన్నారు. ఇప్పటికీ చంద్రబాబు బేరాలు పెడుతూనే ఉన్నాడన్నారు. ఎట్టి పరిస్థితుత్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అడ్డంకులు ఎన్ని వచ్చినా ఎదుర్కొంటానని సీఎంకు చెప్పానన్నారు. నా వేదికపై నన్ను ఎదిరించి మాట్లాడుతావా.. అని చంద్రబాబు బెదిరించాడని, సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్‌ కట్‌ చేస్తున్నారు కాబట్టి గట్టిగా మాట్లాడాల్సి వస్తుందని అన్నానన్నారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలను బిచ్చగాళ్లను చేస్తున్న సీఎం
కర్నూలు నియోజకవర్గంలో ఓట్లు పడలేదు కాబట్టి అభివృద్ధి చేయను అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఐజయ్య అన్నారు. నంద్యాలలో ప్రజా సొమ్మును రూ. కోటి ఖర్చు చేసి ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశాడని, కానీ ఇఫ్తార్‌ విందుకు వెళ్లిన ముస్లిం సోదరులంతా బాబుకు వ్యతిరేకంగానే ఉన్నారన్నారు. ఓట్లు వేస్తేనే నంద్యాలను అభివృద్ధి చేస్తా.. ఓట్లు వేయకుంటే రోడ్లపై నడవొద్దు.. నేను ఇచ్చిన పెన్షన్లు తీసుకోవద్దు.. ఏఏ గ్రామాల నుంచి ఓట్లు పడలేదో.. ఆ గ్రామాల అభివృద్ధిను అడ్డుకుంటానని మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఓటుకు రూ. 5 వేలు పెట్టి కొనగలనని పిచ్చిపట్టిన వాడిలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్నారన్నారు. ఏదైనా డబ్బుతో కొనగలననే వి్రరవీగుడుతనంతో మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చంద్రబాబు బిచ్చగాళ్లను చేసి మాట్లాడుతున్నారన్నారు.  
Back to Top