చంద్రబాబు అబద్దాల కోరు

విశాఖ‌: చంద్రబాబు అబద్దాల కోరు అని ఎమ్మెల్యే ఐజ‌య్య విమ‌ర్శించారు. విశాఖ వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో ఆయ‌న మాట్లాడారు. చంద్ర‌బాబు కార‌ణంగా  రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని మండిప‌డ్డారు. ప్రత్యేకహోదాను తన కమీషన్ల కోసం ప్రత్యేక ప్యాకేజి తెచ్చుకున్నారని విమ‌ర్శించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వ‌చ్చాక వాటిని తీర్చార‌ని చెప్పారు.  వైయ‌స్‌ జగన్  మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర మండుటెండల్లో చేస్తున్నార‌ని, ఆయ‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విశేష స్పంద‌న రావ‌డంతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు చంద్ర‌బాబు దొంగ దీక్ష‌లు చేస్తూ ప్ర‌జాధ‌నాన్ని వృథా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 
Back to Top