ముస్లింలపై బాబు సవతి ప్రేమ


కర్నూలు: ముస్లింలపై చంద్రబాబు సవతి ప్రేమ చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. గుంటూరు సీఎం సభలో ప్రశ్నించిన ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ముస్లింలకు చంద్రబాబు ఏం చేశారని ఆయన నిలదీశారు.ముస్లింల హామీ ఒక్కటైనా ఇంతవరకు చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు.  ముస్లిం యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండు చేశారు. 
 
Back to Top