ప్రాణాల‌తో టీడీపీ నేత‌ల చెల‌గాట‌మా?

క‌ర్నూలు: అధికార టీడీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం మండిప‌డ్డారు. అలాంటి వారికి ఉసురు తప్పకుండా తగులుతుంద‌ని హెచ్చ‌రించారు. క్వారీ యజమానిపై  గ్రామస్తులు పలుమార్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. లీజుదారులకు ఇచ్చిన దానికంటే ఎక్కువ భాగాన్ని డిటోనేటర్లతో పేల్చడం దారుణం. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్నా అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల‌ని గుమ్మనూరు జయరాం డిమాండు చేశారు. క‌ర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ క్వారీలో పేలుళ్లు సంభవించి 12 మంది మృత్యువాత పడగా, మరికొంతమంది తీవ్రగాయాలపాలైన విష‌యం విధిత‌మే.  

Back to Top