కేంద్రం మెడలు వంచే సత్తా వైయస్‌ జగన్‌కే ఉంది

గుంటూరు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేక పోరాటాలు చేసిందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ హోదా సాధన కోసం దీక్షలు, ధర్నాలు, బంద్‌లు, యువభేరీలు చేపట్టి ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో గౌరు చరితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఆచరణకు సాధ్యం కాని 600ల హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికలు తొందరలోనే రాబోతున్నాయని, వైయస్‌ జగన్‌ సీఎం కావాలంటే ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ రాష్ట్రంలోని టీడీపీ సర్కార్‌కు ఏమైంది..? విభజన చట్టం, ప్రత్యేక హోదా అంశాలను నట్టేట ముంచాయి. వంచనకు మారు పేరు చంద్రబాబు.. నమ్మకద్రోహానికి మారుపేరు మోడీ.. ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ పవన్‌ కల్యాణ్‌ పబ్బం గడుపుకుంటున్నాడని ఆరోపించారు. అందరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే జీవితాలు బాగుపడతాయని గౌరు చరితారెడ్డి సూచించారు. అనుభవం అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మోడీ దగ్గర దాన్ని తాకట్టుపెట్టావా అని ప్రశ్నించారు. జననేతకు అవకాశం ఇస్తే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే అద్భుతమైన పాలన అందిస్తారన్నారు. 25 పార్లమెంట్‌ సీట్లు సాధించుకుంటే కేంద్ర మెడలు వంచైనా వైయస్‌ జగన్‌ హోదా తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. 
Back to Top