నిజాలను ఎవరూ అణచివేయలేరు


గుంటూరు: నిజాలను ఎవరూ అణచివేయలేరని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడటానికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కారణమని, వారే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం వాదన, ప్రజల వాదన వినాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలు విని ..దానిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని గుర్తు చేవారు. నిజాలను కూడా బయటకు రానివ్వకుండా , దాదాపు రూ.400 కోట్ల మైనింగ్‌ కుంభకోణం జరిగిందని, ఇందులో నిజాలు బయటకు రాకుండా అణచివేసే కార్యక్రమాలు, హౌస్‌ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. మొన్న నరసరావుపేటలో నడిరోడ్డుపై కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరామకృష్ణ స్టేజీ వేసి ఉదయం 10 గంటల నుంచి ప్రజలను, ట్రాఫిక్‌ను ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. ఆ రోజు లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి అని ప్రశ్నించారు. 
 
Back to Top