బోగస్‌ సర్వేలతో టీడీపీ నేతలు డ్రామా

 
 గుంటూరు: ఆంధ్రపదేశ్‌లో  బోగస్‌ సర్వేలతో టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నార‌ని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిప‌డ్డారు.  మంగళవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ..  నిజంగా రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా ఉంటే బై ఎలక్షన్లకు చంద్రబాబు సిద్ధమా?.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్లు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను కొనుగోలు చేసిన చంద్ర‌బాబు..వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డ‌కుండా కాపాడుకుంటూ వ‌స్తున్నార‌న్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న‌కు ద‌మ్ముంటే, టీడీపీ నాలుగేళ్ల పాల‌న‌పై విశ్వాసం ఉంటే ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని స‌వాల్ విసిరారు. 


Back to Top