కోటప్పకొండపై కోడేల ప్రమాణం చేయగలరా?


గుంటూరు: టీడీపీ నేతల అరాచకానికి అడ్డూ, అదుపు లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.  టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడే నరసరావుపేటలో బెట్టింగ్‌ కీలక సూత్రదారి అని, కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తె అవినీతి అంతా, ఇంతా కాదని విమర్శించారు. కోడెలకు దమ్ముంటే అవినీతికి పాల్పడలేదని కోటప్పకొండపై ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్‌ విసిరారు. వెన్నాదేవిలో భూ కబ్జా చేసిందెవరని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసం రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించిందెవరని నిలదీశారు. అపార్టమెంట్లలో ప్రతి ప్లాట్‌కు లక్ష వరకు మామూళ్లు వసూలు చేసిందెవరని ధ్వజమెత్తారు. అవినీతిని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఘనత కోడెలదే అని విమర్శించారు. 
 
Back to Top