టీడీపీ ఎమ్మెల్యే బండారుపై సీపీకి ఫిర్యాదు

విశాఖపట్నంః టీడీపీ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై వైయస్సార్సీపీ మహిళా నాయకులు సిటీ పోలీస్ కమిషన్ ర్ యోగానంద్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడిన బండారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసభ్య పదజాలంతో బండారు చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను కించపర్చాయని అన్నారు.  కలిసిన వారిలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పార్టీ నాయకురాలు ఉషాకిరణ్ , వెంకటలక్ష్మి తదితరులున్నారు.

Back to Top