బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకే బంద్‌వైయస్‌ఆర్‌ జిల్లా: మాట తప్పిన బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకే బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మారుస్తుందని మండిపడ్డారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండు చేశారు. కడప ఉక్కు పరిశ్రమ సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్‌కు జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని, వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ బంద్‌ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కదలిక రావాలని సూచించారు. జిల్లా బంద్‌లో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని వైయస్‌ఆర్‌ జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావాలని ఆకాంక్షించారన్నారు. 
 
Back to Top