సీఎంలకు భజన చేయడం జేసీకి అలవాటు


హైదరాబాద్‌:  అధికారంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ సీఎంకు భజన చేయడం ఎంపీ జేసీదివాకర్‌రెడ్డికి అలవాటు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.  జానీవాకర్‌రెడ్డి మాట్లాడిన భాషను వింటూ ఆనందించిన చంద్రబాబుకు సంస్కారం లేదని విమర్శించారు. దివాకర్‌రెడ్డికి వైయస్‌ కుటుంబం గురించి మాట్లాడేందుకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. మా నాయకుడికి సంస్కారం ఉంది కాబట్టి మా నోర్లు కట్టేస్తున్నారని తెలిపారు. 2004 వరకు అనంతపురం జిల్లాలో రాజకీయాలు చేయలేక పారిపోయిన వ్యక్తి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి దయతో మంత్రి అయ్యారని గుర్తు చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top