రైతుల గురించి పట్టించుకునే నాథుడు కరువు


హైదరాబాద్‌: రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడిందని, ఈ ప్రాంతం గురించి పట్టించుకునే వారే కేబినెట్‌లో లేరని ధ్వజమెత్తారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి అయోమయంలో ఉంటే ఏ రకంగా వ్యవసాయంలో రాష్ట్రం మొదటిస్థానంలో ఉందో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన పట్టుబట్టారు. 
 
Back to Top