పార్టీ మారినవారికి మంత్రి పదవులా..?

వైయస్‌ఆర్‌ జిల్లాః . హోదా గురించి అసెంబ్లీలో చర్చకు రానివ్వరని ప్రశ్నిస్తే మైక్‌ కట్‌ చేస్తారని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారినవారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని, వారిపై చర్యలు తీసుకుంటే మరుసటి రోజే అసెంబ్లీకి హాజరవుతామన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేత రాచముల్లు శివప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును పొగడటానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రతి శాసన సభ్యుడికి నిధులు కేటాయిస్తున్నారా అని ప్రశ్నించారు.  వైయస్‌ఆర్‌సీపీ  ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసా ఇవ్వలేదని, చంద్రబాబు అప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top