వైయస్‌ జగన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది


తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం వైయస్‌ జగన్‌ను కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. 200 రోజులు పాదయాత్ర చేయడమంటే సామాన్యవిషయం కాదని చెప్పారు. ఆర్భాటాలకు దూరంగా ఉండి, మొక్కలు నాటాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది చెప్పారు. ప్రజల ఆశీస్సులు వైయస్‌ జగన్‌కు మెండుగా ఉన్నాయన్నారు. రాజన్న రాజ్యం త్వరలోనే రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
Back to Top