బాబు నాలుగేళ్ల సినిమా అట్టర్‌ ఫ్లాప్‌

హైదరాబాద్‌:  చంద్రబాబు నాలుగేళ్ల సినిమా ఫ్లాప్‌ అయ్యిందని, ప్రమోషన్లతో కాలయాపన చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మళ్లీ అవకాశం ఇవ్వండి తలసరి ఆదాయం పెంచుతానని చంద్రబాబు కళ్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. 2050లో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నారు..బీసీలు జడ్జీలు కాకుండా అడ్డుకున్నారన్నారు. ఇనాటికి మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇంతవరకు గిరిజన కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. కేవలం పబ్లిషిటి స్టంట్‌తో ఎదుచరుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఎవరైనా ఆట బాగా ఆడితే నేనే నేర్పించానని పబ్లిషిటి కోసం తహతహలాడుతున్నారన్నారని ఫైర్‌ అయ్యారు. పోలవరంకు అనుమతులు తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన తవ్విన కాల్వలకు పట్టిసీమ, పురుషోత్తం ఎత్తిపోతల పథకం అని పేర్లు పెట్టుకున్నారన్నారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని విమర్శించారు. 
 
Back to Top