బీడు భూములు సస్యశ్యామలం చేయడమే ధ్యేయం– ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
– ఝరికోన ప్రాజెక్టు నుంచి రెండో రోజు పాదయాత్ర ప్రారంభం
వైయస్‌ఆర్‌ జిల్లా: జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.  కృష్ణాజలాల సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రెండో రోజు ప్రారంభమైంది. సంబేపల్లి మండలం ఝరికోన ప్రాజెక్టు నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. కృష్ణా జలాలకు తీసుకొచ్చి ఝరికోనలో కాలువలు నిర్మిస్తానని ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీకాంత్‌రెడ్డి పాదయాత్రకు పార్టీ నాయకులు, రైతులు సంఘీభావం ప్రకటించి వెంట నడుస్తున్నారు. ఈ పాదయాత్ర శనివారం ముగుస్తుంది. 
 
Back to Top