టీడీపీ నేతలు ప్రజాద్రోహులు

కృష్ణా జిల్లా: హోదా కోసం రాజీనామా చేయని టీడీపీ నేతలు ప్రజాద్రోహులని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఆదివారం వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పామర్రులో ఏర్పాటుచేసిన బహింరంగ సభలో ఆమె ప్రసంగించారు. . ఏపీ సీఎం చంద్రబాబు తీరు తన ఇంట్లో దొంగతనం చేసి తానే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లుందని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు ధర్మ పోరాటమని నాటాకాలు ఆడుతన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాలంటే.. వైయ‌స్ఆర్‌ , జగన్‌ అభిమానులు, ఎన్టీఆర్‌ అభిమానులు వైయ‌స్ఆర్‌ సీపీకి ఓటేయాలన్నారు. అది ఎలా ఉండాలంటే ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతోందో అలా పామర్రు ఓటర్లు ఉండాలన్నారు. డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తులు కూడా వైయ‌స్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నారని, జగన్‌ బొమ్మపై గెలిచి మోసం చేసిన ఆ శాసనసభ్యురాలికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Back to Top