రుణ‌మాఫీ పేరుతో మోసం

 

చిత్తూరు: రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాఫీ చేయకుండా రైతులను, మహిళలను మోసం చేశారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిప‌డ్డారు. వాల్మీకిపురంలోని షిర్డీసాయినగర్‌లో ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, బూత్‌ కమిటీ మెంబర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని, మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉందని గుర్తు చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితులో లేరన్నారు.

Back to Top