హంద్రీనీవాకు వెయ్యికోట్లు ఇవ్వాలి: విశ్వేశ్వర్‌రెడ్డి

అనంతపురం:అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా పథకం పూర్తి చేయడానికి 2015-16 బడ్జెట్‌ లో ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించాలని  వైఎస్సాఆర్‌సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందించిన పాపాన పోలేదని విమర్శించారు. అధికార పార్టీ నేతలు పత్రికల్లో ఫొటోలకు ఫోజులిస్తూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. రైతు బాంధవుడైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవా ప్రాజెక్టు కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు కోసం కేవలం రూ.100 కోట్లు ముష్టి వేశారని ఎద్దేవా చేశారు. టీడీపీకి చెందిన  12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అనంతపురాన్ని చిన్నచూపు చూడటం తగదన్నారు. జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు ఇకనైనా నిద్రలేవాలని చరకలంటించారు. ఈ ఖరీఫ్‌కైనా జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా చూడాలని సూచించారు.
Back to Top