వైయస్‌ జగన్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. జిల్లాలో లక్షలాది మంది వైయస్‌ జగన్‌ వెంట నడిచారని చెప్పారు. ఒక మీటింగ్‌ను మించి మరో మీటింగ్‌కు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రకు అనుహ్య స్పందన లభించిందని, దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. టీడీపీ నేతలు అభివృద్ధి జరిగిందంటూ తమ అనుకూల మీడియాల్లో తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ నాయకులు సిగ్గు, శరం వదిలేశారని, మీడియాను, అధికారాన్ని అడ్డుపెట్టుకొని బతుకుతున్నారని ఫైర్‌ అయ్యారు. 

 

తాజా ఫోటోలు

Back to Top