ప్రత్యేక హోదా దోషి బీజేపీ, టీడీపీలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
గుంటూరు: ప్రత్యేక హోదా దోషులు చంద్రబాబు, నరేంద్రమోడీనే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ యూటర్న్‌ తీసుకొని హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేయడం హాస్యాస్పదం. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా రెండు ప్రభుత్వాలతో పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం, రాష్ట్రంలో బీజేపీతో కలిసి కాపురం చేసి ఇవాళ పోరాడుతున్నామంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు తన టక్కుటమార విద్యతో ప్రజలను మోసం చేయడం తగదని, బాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top