స్పీకర్‌ను డిక్టెట్‌ చేయడం ఏంటి?

ఏపీ అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికార పార్టీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని, సభను ఎలా నడపాలో అని టీడీపీ నేతలు, మంత్రులు స్పీకర్‌ను డిక్టెట్‌ చేయడం ఏంటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఉదయం అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు జల దినోత్సవం గురించి మాట్లాడిన వెంటనే సభను వాయిదా వేయాలని ప్రభుత్వ చీప్‌విప్‌ కాల్వ శ్రీనివాసులుకు సైగ చేయడం, కాల్వ శ్రీనివాసులు వెంటనే దుకాణం క్లోజ్‌ చేయాలని స్పీకర్‌కు సూచించడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొక మంత్రి వైయస్‌ఆర్‌సీపీకి మైక్‌ ఇస్తే నేను ఉండనని స్పీకర్‌కు ఆల్టిమేటం ఇవ్వడం ఏంటని నిలదీశారు.  సభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని సూచించారు. చంద్రబాబు ప్రజలతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక మరోలాగా మాట్లాడే విధానానికి స్వస్తి పలకాలని చెవిరెడ్డి హితవు పలికారు.

Back to Top