పోరాటంలో నా ప్రాణం పోయినా సరే..?

  • డంపింగ్‌ యార్డ్‌ ఎత్తివేయాలంటే క్షకకడతారా..?
  • ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష భగ్నం..అరెస్ట్
  • అర్థరాత్రి మహిళా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు: నా ప్రాణం పోయినా సరే డంపింగ్‌ యార్డు ఎత్తివేసే వరకు పోరాడుతానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని డంపింగ్‌ యార్డును తొలగించాలంటూ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చేస్తున్న దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల తీరుపై చెవిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రామాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, డంపింగ్‌ యార్డు ఎత్తివేయమన్నందుకు నాపై కుట్ర పన్నుతున్నారన్నారు. లోకేష్‌ ఆదేశాలతోనే అర్ధరాత్రి మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన డంపింగ్‌ యార్డును తొలగించాలని దీక్ష చేయడం తప్పా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి మహిళలను అరెస్టు చేస్తారా.. ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు. అక్రమంగా 100 మంది మహిళా కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. నా నియోజకవర్గ ప్రజల క్షేమమే నా లక్ష్యమని, దాని కోసం ఎంత దూరమైన వెళ్లి పోరాటం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top