ప్రజల డబ్బుతో రాజకీయం చేయడం తగదు

– మీ దీక్షలకు సామాన్య ప్రజలెవరైనా హాజరవుతున్నారా?
– కేవలం టీడీపీ కేడర్‌ తప్పతే మరెవరూ వుండరు
– పెట్టిన కార్యక్రమాలనే నవ నిర్మాణ దీక్షలో పెడుతున్నారు
– సంవత్సరానికి పల్లె నిద్ర 24 రోజులు
–  పల్లె పిలుపు 48 రోజులు
–  మీ కార్యక్రమాలు రోజులకు రోజులు వృథా
హైదరాబాద్‌: ప్రజల డబ్బుతో చంద్రబాబు రాజకీయాలు చేయడం తగదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేపట్టే దీక్షలతో ప్రజాధనం వృథా అవుతుందని మండిపడ్డారు. పెట్టిన కార్యక్రమాలనే నవ నిర్మాణ దీక్షలో పెడుతున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలెవరూ రావడం లేదని, టీడీపీ కేడర్, అధికారులు మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు నగరంలో దోమలపై దండయాత్ర పేరుతో పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. బహుబలి తర హాలో సీఎం పెద్ద టోపీ పెట్టుకొని ఉన్న ఫోటో ఒక వైపు, మరోవైపు పెద్ద దోమ బొమ్మ ఒక వైపు. ఈ బోర్డును చూసి ప్రజలు నవ్వుకోవడంతో హడావుడిగా ఆ బోర్డును తొలగించారు. అశాస్తీ్రయంగా రాష్ట్రాన్ని విడగొట్టారని నాలుగేళ్లుగా ప్రతి కార్యక్రమంలో ఇదే ఏడుపు ఏడ్చుతున్నారని విమర్శించారు. ఇదేనవనిర్మాణ దీక్షలో గతేడాది చంద్రబాబు ఏం మాట్లాడారు‘‘ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు సహరిస్తే తీరని ద్రోహమన్న చంద్రబాబు ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయడమే కాకుండా సీఎం పదవి ప్రమాణ స్వీకారానికి వెళ్లి రాహుల్‌తో ఫోటోలకు ఫోజులచ్చింది చంద్రబాబు కదా అన్నారు. ఈ రోజు పేపర్లో చూస్తే ఎక్కడ నవనిర్మాణ దీక్ష, ఎక్కడ జలహారతి అని నిలదీశారు. ప్రభుత్వ ఖజానాతో దీక్షలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని  మండిపడ్డారు. మీరు చేసే ధర్మ పోరాట దీక్షకు ప్రజా ధనం ఎలాఖర్చు చేస్తారని ప్రశ్నించారు. నవనిర్మాణ దీక్షలో ఉన్న కంటేంట్‌ ఏంటని నిలదీశారు. మొదటి రోజు ప్రతిజ్ఞ, రెండో రోజు నీరు, అర్థం లేని అనవరసర కార్యక్రమాలు పెట్టి వారం రోజుల పాటు అధికారులు తప్ప, ప్రజలేవరూ లేరని విమర్శించారు. ఏ కార్యక్రమం పెట్టిన ప్రజలు హాజరు కావడం లేదని డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొచ్చారన్నారు. వారు కూడా రామని మొండికేయడంతో పింఛన్లు ఇస్తామని సభకు తెచ్చుకున్నారు. ఇక వారు కూడా మిమ్మల్ని నమ్మకపోవడంతో ఇక అధికారులను సభకు తరలిస్తున్నారన్నారు. హ్యాపీ సండే అంటూ అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నవనిర్మాణ దీక్ష 7 రోజులు, జన్మబూమి 7 రోజులు, పల్లె నిద్ర అంటూ ప్రతి అధికారి వారంలో రెండు రోజులు, ప్రతి బుధవారం పల్లె పిలుపు, పల్లె పిలుపు 48 రోజులు, పల్లె నిద్రకు 24 రోజులు, జలహారతికి ప్రతి నెల సీఎం ఒక జిల్లాకు వెళ్తుండటంతో అధికారులు తమ పనులు మానుకోని సీఎం కార్యక్రమాలను హాజరవుతున్నారు. ఏడాదికి 50 నుంచి 100 రోజులు ముఖ్యమంత్రి కార్యక్రమాలకే సరిపోతుందన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పనికి వెళ్లలేకపోతున్నారన్నారు. నవనిర్మాణ దీక్షకు రూ.13 కోట్లు విడుదల చేశారన్నారు. ప్రచారానికి రూ.4 కోట్లు..ఇందులో రూ.1.50 లక్షలు, రూ. ఆంధ్రజ్యోతికి రూ.80 లక్షలు, సూర్య, ప్రభలకు ఇచ్చారు. చంద్రబాబు కార్యక్రమాలకు రూ.12 వేల కోట్లు వృథా అవుతుందన్నారు. ప్రతిజ్ఞ అంటూ అవినీతి, అశాస్తి్రయ విభజన అంటున్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అన్నింటిలో అవినీతినే అన్నారు. చివరకు దేవుడి భూమిలో కూడా అవినీతినే అన్నారు. కిందిస్థాయిలో జన్మబూమి కమిటీలను అప్పగించారన్నారు. చంద్రన్న మజ్జిగ అంటూ ఒక్కొక్క ఊర్లో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తారట. ఎక్కడైనా మజ్జిగ పోస్తున్నారా అని ప్రశ్నించారు. 50 గ్లాసుల మజ్జిగను ఊరంతా పోస్తారా అని నిలదీశారు. నాలుగేళ్ల పాలనలో ఏమి చేయలేని చంద్రబాబు ఇన్నాళ్లు బీజేపీని బ్రహ్మండంగా పొగుడుకున్నారన్నారు. ఇవాళ బీజేపీని విమర్శిస్తూ..తన తప్పేమి లేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమయమే కాదు..డబ్బు కూడా చంద్రబాబు వృథా చేశారని విమర్శించారు. ఇన్నాళ్లు ప్రత్యేక హోదా వ ద్దంటూ..ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని హోదా కావాలని కోరడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శమన్నారు. నా కష్టానికి ఫలితం ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం మనసు లేని ప్రతిపక్షం అంటూ మాపై బీద ఏడుపులు ఏడ్చుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడుతున్నారని, చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. పులివెందుల కూడా ఏపీలోనే ఉందని గుర్తు చేశారు. 
 
Back to Top