బాబు ఆరోగ్యం బాగానే ఉందా..?

  • పెన్షన్లు, రోడ్లు మీ సొంత ఇంటి నుంచి ఇస్తున్నారా..?
  • 30 ఇయర్స్‌ పొలిటికల్‌ ఇండస్ట్రీ ఇలా మాట్లాడడం ఏంటీ..?
  • ఓట్లేయకపోతే మీకు ఏమీ చేయనని బెదిరిస్తారా..?
  • చంద్రబాబు రియల్‌ క్యారెక్టర్‌ బయటపడుతోంది
  • పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వింటుంటే అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేనట్టుగా అనిపిస్తోందని పీఏసీ చైర్మన్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా అంతా పర్యటించిన చంద్రబాబుకు ప్రజల స్పందన చూసి ప్రెస్టేషన్‌ వచ్చినట్లుగా స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. అందుకనే పూర్తిగా సహనం కోల్పోయి, నియంతృత్వ ధోరణి, పబ్లిక్‌ను బెదిరించడం వంటివి చేస్తున్నాడన్నారు. ‘‘నేను వేసిన రోడ్లు, నేను ఇస్తున్న పెన్షన్లు’’ అని ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పని అన్నారు. మీ సొంత ఇంటి నుంచి ఇస్తున్నారా అని నిలదీశారు. ప్రజల సంక్షేమాలు చూడడానికి వారు 5 సంవత్సరాలు సమయం ఇచ్చారని చంద్రబాబుకు చురకంటించారు. సొంత ఇంటి నుంచి ఇచ్చినా బాబులా ఎవరూ మాట్లాడరని దుయ్యబట్టారు. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ, చాలా అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటన్నారు. బాబు ఆలోచనలు ఎంత కుటిలంగా ఉంటాయో వాస్తవ క్యారెక్టర్‌ బయటపడుతుందన్నారు. 

జన్మభూమి కమిటీల మాఫియా..
నాకంటూ మీరు ఓట్లే వేయకుంటే.. నేను వారిని గుర్తు పెట్టుకుంటాను. ఆ గ్రామాలకు ఇబ్బందులు కలిగిస్తాను అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మీకు ఓటేయరనే అభద్రతాభావం ఎలా కలిగివున్నారని బుగ్గన చంద్రబాబును ప్రశ్నించారు. ఏరకంగా ఓట్లేయరని చెప్పగలుగుతున్నారని నిలదీశారు. బాబు మాటలు వింటుంటే అంతా మంచిగానే ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల నుంచి పట్టణాల వరకు మాఫియా నడుస్తోందని బుగ్గన విమర్శించారు. సామాన్య మానవుడు తన కష్టార్జితంతో ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి కూడా జన్మభూమి కమిటీల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు పరిపాలనలో ప్రజలందరికీ ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. 

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కర్నూలులో చంద్రబాబు మాట్లాడిన తీరు...ఆయన ప్రవర్తన చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు.  రాజకీయంగా ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకొచ్చాం. నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాయకుడు కావాలి, ఎన్నికలు గెలవాలి. గెలవడానికి నాయకుడు కావాలి కాబట్టి మేం కొన్ని రాజీ పడ్డాం. నావల్ల లాభం పొందినవాళ్లంతా మళ్లీ నాకు ఓటేయాలి కదా..? నేను తలచుకుంటే ఓటుకు 5వేల రూపాయిలు ఇవ్వగలను, కానీ ఎందుకు ఇవ్వాలి. మీకు ఓటుకు 5 వేలు ఇవ్వాలంటే మీ దగ్గరే నేను 5 లక్షల చొప్పున వసూలు చేయాలి. నాకు వ్యతిరేకంగా ఏవైనా గ్రామాలుంటే వాటికో నమస్కారం పెడతా. నేనంటే మీకు ఇష్టం లేకపోతే... నేను మీకెందుకు పనులు చేయాలి? అని బాబు మాట్లాడడంపై మండిపడుతున్నారు. 
Back to Top