ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు లెక్కలున్నాయా?– రాజధాని కట్టేందుకు 2, 3 ఫేజ్‌లు మార్చారు
– ప్రభుత్వానికి అప్పు ఇస్తున్న వారి వివరాలు చెప్పడానికి భయమెందుకు 
– ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బులన్నీ అప్పు చేస్తున్నవే
– ప్రభుత్వం వద్ద రూ.7 వేల కోట్లు ఉంటే మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు 
– పొరుగు రాష్ట్రాలు తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకున్నాయి
 
హైదరాబాద్‌: ఏపీ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చులకు లెక్కలున్నాయా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు లెక్కలు, చుక్కలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి అప్పు ఇచ్చిన తొమ్మిది మంది ఎవరో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని సూచించారు. అన్నింటిలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఆ తొమ్మిది మంది పేర్లు ఎందుకు చెప్పడం లేదని నిదీశారు. రేపు పొద్దున బడ్జెట్‌ బుక్కులో  చూపించాల్సిందే అన్నారు. ఏపీ ప్రభుత్వం జీవో ఎంఎస్‌ నంబర్‌ 21ని విడుదల చేసిందని, సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్లు అప్పులు తీసుకువచ్చానని, 7.5 శాతం వడ్డీకి తీసుకోవచ్చని జీవో ఇచ్చిందన్నారు. రాజధాని నిర్మించేందుకు రెండు, మూడు ఫేస్‌లు చెప్పారని, మొదటి ఫేస్‌ నిర్మాణానికి రూ.48 వేల కోట్లు అవసరమని, 56 పనులు చేయాల్సి ఉందని ప్రభుత్వమే ధ్రువీకరించిందన్నారు. అందులో 36 పనులు రూ.26600 కోట్లకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయని చెప్పారన్నారు. టెండర్‌ ప్రక్రియలో ఆరు పనులు న్నాయని, వీటికి రూ.10600 కోట్లు అవసరమని,  ఇంకా టెండర్‌కు సిద్ధంగా 18 పనులు ఉన్నాయని, వీటికి రూ.1156 వేల కోట్లు అవసరమని చెప్పారన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆంధ్రా బ్యాంకు,ఇండియన్‌ బ్యాంకు, విజయ బ్యాంకుల నుంచి రూ.2060 కోట్లు అప్పు చేశారన్నారు. హుడ్కో నుంచి రూ.14500 కోట్లు అప్పు చేశారని, కేంద్ర ప్రభుత్వం పునర్వీభజన చట్టం ప్రకారం ఇప్పటికే రూ.1500 కోట్లు ఇచ్చిందన్నారు. ఇటీవల రూ.2 వేల కోట్లు బాండ్ల రూపంలో పొందారని చెప్పారు. మొత్తం రూ.7010 కోట్లు అయ్యిందన్నారు. ఈ ఏడాది మొత్తం రూ.15 వేల కోట్లు అవసరమని చంద్రబాబే చెబుతున్నారని, మీ చేతుల్లో ఉండేది రూ.7 వేల కోట్లే అని, మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. మరోపక్కా రూ.26600 కోట్ల పనులు మొదలుపెట్టామని చంద్రబాబు చెబుతున్నారని తెలిపారు. సీఈవో, సీఎఫ్‌వోగా, విజనరీగా, థింకర్‌గా పేరుగాంచిన చంద్రబాబుకు ఈ లెక్కలు లతెలియవా అని ఎద్దేవా చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.8300 కోట్లు తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్‌ రూపొందించిందన్నారు. హుడ్కో నుంచి ఇంకా రూ.6200 కోట్లు, వివిధ బ్యాంకుల నుంచి ఇంకా రూ.10 వేల కోట్లు తీసుకోవాలని చంద్రబాబు ప్లాన్‌ రూపొందించారన్నారు. ఇన్నీ తెచ్చినా కూడా ఇంకా రూ.24500 కోట్లు అప్పు చేయాల్సి వస్తుందని వివరించారు. ఇప్పటి వరకు రూ.31 వేల కోట్లు మాత్రమే మీ చేతికి వస్తాయని, అయితే మొదటి ఫేజ్‌కు రూ.46 వేల కోట్లు అవసరమవుతాయని మీరు చెప్పిన లెక్కలే ఉన్నాయన్నారు. మిగతా డబ్బులు రూ.16500 కోట్లు మొదటి ఫేస్‌కే తక్కువవుతాయని చెప్పారు. చంద్రబాబు చెప్పే అంకెలన్నీ శనగకాయలు, పప్పులు మాదిరిగా కోట్లు కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు.ఇప్పటి వరకు దేశంలో కట్టిన గొప్ప రాజధానులు చూద్దామని, నయా రాయపూర్‌ రాజధాని నిర్మాణానికి రూ.10 వేల కోట్లు అవసరమైందన్నారు.  లక్షల ఎకరాలు, కోట్ల విలువ చేసే రాజధాని కడతామంటున్న చంద్రబాబు బడ్జెట్‌ కేటాయింపుల్లో ఎంత కేటాయింపులు చేశారని ఆయన ప్రశ్నించారు. 2016–2017వ సంవత్సరం బడ్జెట్లో రూ.310 కోట్లు, ఇందులో ఖర్చు చేసింది ఒక్క కోటి మాత్రమే అన్నారు. 2017–2018వ ఆర్థిక సంవత్సరంలో రూ.670 కోట్లు, ఇందులో ఖర్చు చేసిందేంతో చెప్పలేదన్నారు. 2018–2019లో రూ.7741 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల బడ్జెట్‌ సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. ఇందులో అమరావతికి రూ.400 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నట్లు అర్థమవుతుందన్నారు. ఇంతవరకు రాజధానిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, బ్రిడ్జి, కరెంటు కలిసి రూ.11 వేల కోట్లు పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతుందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ భవనాలు కట్టాలనుకుంటున్న ప్రభుత్వం లెక్కలకు పొంతల లేదన్నారు.  ఇంతపెద్ద దేశంలో కేవలం ఐదు కంపెనీలకు మాత్రమే చంద్రబాబు నిర్మాణ బాధ్యతలు అప్పగించారని, వారే రోడ్లు వేస్తారని, వారే బిల్డింగ్‌లు కడుతారని విమర్శించారు. 
 
Back to Top