సింగపూర్‌ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారు?

హైదరాబాద్‌: సింగపూర్‌ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. సింగపూర్‌ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. టికెట్టు తీసుకుని ఆ సదస్సుకు వెళ్లారన్నారు. నాలుగేళ్లలో ఆయన ఆరుసార్లు సింగపూర్‌కు వెళ్లారని విమర్శించారు. అమరావతిలో అందరూ ఎలక్ట్రికల్‌ బైక్స్‌లో తిరుగుతున్నట్లు చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.ప్రధాని తరువాత ఎక్కు విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబే అన్నారు.
 
Back to Top