‘నా హక్కులకు భంగం కలిగిస్తున్నారు’


అమరావతి: తన హక్కులకు, ప్రతిష్టకు కొందరు వ్యక్తులు భంగం కలిగించారని పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్, వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు స్పీకర్‌తో మాట్లాడి ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదు కాపీని స్పీకర్‌కు పంపారు. అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఫిర్యాదు కాపీని పంపించారు. 
 
Back to Top