చంద్రబాబుది దీక్ష కాదు..ఉపవాసం


 – వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనా«ద్‌రెడ్డి
– చంద్రబాబు దీక్ష సారాంశం ఏమిటీ?
–బాబు దీక్షలో జనం కంటే ఎక్కువ ఏసీలు, దిండ్లే కనబడ్డాయి
హైదరాబాద్‌:ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న చేసింది దీక్ష కాదని, చేసిన పాపాలు పోవడానికే ఉపవాసాలు చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనా«ద్‌రెడ్డి విమర్శించారు. ఆయన దీక్ష సారాంశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా అంత ప్రోగ్రెసివ్‌ సీఎం ఎవరు లేరని చంద్రబాబు చెబితే మీడియా కూడా నమ్ముతూ వచ్చారన్నారు. చంద్రబాబు సీఎం కాకముందు ఐటీ ఎగుమతులు దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉండేదన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి ఆ స్థానాన్ని ఐదో ప్లెస్‌కు తీసుకెళ్లారన్నారు. 1995లో చెన్నైలో ఐటీ పరిశ్రమ లేదని, అలాంటి తమిళనాడు అనాతికాలంలోనే మూడో స్థానంలో వచ్చిందన్నారు. అయితే ఏ రోజు కూడా అక్కడి సీఎంలు ఐటీ పరిశ్రమపై చంద్రబాబులా ప్రచారం చేయలేదన్నారు. చంద్రబాబు పాలనలో ఐటీ పరిశ్రమ జీరో అన్నారు. నాలుగేళ్లలో రాజధానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కేవలం ప్రచారంతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. 40 ఏల్ల అనుభవం ఉన్న వ్యక్తి పరిపాలించడం కూడా రాకపోవడం బాధాకరమన్నారు. చంద్రబాబు దీక్షలో జనం కంటే ఎక్కవ ఏసీలు, దిండ్లే కనబడ్డాయని ఎద్దేవా చేశారు. మజ్జిలు, నీళ్ల ప్యాకెట్లతో నిరాహార దీక్షలో పండుగ వాతావరణం కల్పించారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధిస్తే అందరం పండుగ చేసుకోవచ్చు అన్నారు. బాలకృష్ణ స్పీచ్‌ను చూసి చంద్రబాబుకు పదే పదే బీపీ చెక్‌ చేశారన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని, వ్యవసాయాన్ని విస్మరించారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ హామీని గాలికొదిలారన్నారు. నీరు–చెట్టు కార్యక్రమంలోనూ అవినీతి జరిగిందన్నారు. ఇందులో అవినీతి జరిగిందని కాగ్‌ నివేదికలో ఎత్తి చూపిందని గుర్తు చేశారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, భూమి పట్టాల ఆన్‌లైన్‌ కోసం డబ్బులు వసూల్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆఖరికి మరుగుదొడ్లు నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని విమర్శించారు. 
 
Back to Top