బాబుకు ప్రజాక్షేత్రంలో ఓటమి భయం

నిజాయితీ, గట్స్‌ పుట్టుకతోనే రావాలి
వైయస్‌ఆర్‌ కుటుంబం రక్తంలోనే ధైర్యం ఉంది
రాజ్యాంగ విలువలను కించపరిచే విధంగా వైఖరి
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేస్తేనే అసెంబ్లీకి
అనర్హత వేటుపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు
అమరావతి: రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఉండడం ఆంధ్రరాష్ట్ర దౌర్భాగ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నైతిక విలువలు పాటించకుండా టీడీపీలోకి లాక్కున్నారన్నారు. అందులో నలుగురికి మంత్రి పదవులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీకి వస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత సెషన్స్‌లో చెప్పడం జరిగిందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న బడ్జెట్‌ సెషన్స్‌ను కూడా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించడం జరిగిందన్నారు. రాజ్యాంగ విలువలను కించపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటున్నామన్నారు. హైకోర్టు ఫిరాయింపుదారులపై ఎందుకు వేటు వేయలేదని మొట్టికాయలు వేసిందన్నారు. ఫిరాయింపుదారులకు నోటీసులు కూడా పంపించిందన్నారు. 
అనుభవం లేకున్నా.. విలువలతో కూడిన రాజకీయం..
వైయస్‌ జగన్‌ పార్టీ పెట్టి అనుభవం లేకపోయినా.. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. గతంలో ఇతర పార్టీల నుంచి వైయస్‌ఆర్‌ సీపీలోకి వచ్చిన వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉందని, దేశంలోనే అనుభవజ్ఞుడినైన రాజకీయ నేతనని చెప్పుకొని తిరిగే చంద్రబాబు 22 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎన్నికలకు వెళ్తే ఓడిపోతానని భయంతో ఉన్నాడన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే కేసీఆర్‌ వ్యభిచారం చేస్తున్నాడని చంద్రబాబు అన్నారు. అది బాబుకు కూడా వర్తిస్తుందన్నారు.
బాబు రక్తంలో ఏదో డిఫెక్ట్‌ ఉంది
ధైర్యం, నిజాయితీ పుట్టుకతో వస్తాయి. అది వైయస్‌ఆర్‌ కుటుంబం రక్తంలోనే ఉందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ ఏదైనా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటున్నారన్నారు. చంద్రబాబు దౌర్భగ్యం ఆయన రక్తంలో ఏదో డిఫెక్ట్‌ ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, 22 మందితో రాజీనామా చేయిస్తే పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాలతో అసెంబ్లీలోకి అడుగుపెడతామన్నారు. వైయస్‌ జగన్‌ అసెంబ్లీలోకి వస్తే చంద్రబాబుకు భయమని, ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని ఎద్దేవా చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top