అరెస్టుల‌తో ఉద్య‌మాన్ని ఆప‌లేరు
- ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్‌
- నెల్లూరులో భారీ బైక్ ర్యాలీ
నెల్లూరు: అధికారం ఉంద‌ని పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని అరెస్టుల‌తో ఉద్య‌మాన్ని ఆప‌లేర‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన పిలుపు మేరకు మంగ‌ళ‌వారం నెల్లూరులో బంద్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రంలోని  రాజన్న భవన్ నుంచి ఆత్మకూరు బస్సు స్టాండ్, స్టౌన్ హౌస్ పేట, మైపాడు గేటు సెంటర్, చిన్న బజార్, వి.ఆర్.సి., ట్రంక్ రోడ్, ఎం.ఆర్.ఓ. కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింద‌న్నారు.  ఏపీ బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులను అరెస్ట్ చేయ‌డం దుర్మార్గ‌మ‌ని విమ‌ర్శించారు.   బంద్‌ను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసన అనేది రాజకీయ పార్టీల హక్కు అని పేర్కొన్నారు.  హోదా ఉద్య‌మంలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతికి ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌న్నారు. దుర్గారావును పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండ‌గా  కుప్పకూలిపోయార‌న్నారు.  ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే దుర్గారావు మృతిచెందార‌ని చెప్పారు. దుర్గారావు మృతికి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 
Back to Top