నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు

నెల్లూరు: వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ అన్నారు. నెల్లూరు నగరంలోని 8వ డివిజన్‌ కడికల బజార్‌ సెంటర్, అరుంధతీపాలెం, ఎన్డీఆర్‌ లేఅవుట్‌ ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో రావాలి జగన్‌ –కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నవరత్నాలను గడప గడపకూ వెళ్లి వివరించారు. అదే విధంగా ప్రజలు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర 8, 10, 51వ డివిజన్లకు చెందిన పలువురు మాహిళలు అనిల్‌కుమార్‌ సమక్షంలో  వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 Back to Top