టీడీపీకి కాంగ్రెస్‌ గతే పడుతుంది

ఏపీలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవ్వడం ఖాయం
గజినీ మహ్మద్‌లా తయారైన చంద్రబాబు
ఢిల్లీకి వచ్చి హెమాహెమీలను కలుస్తానని, హేమామాలినిని కలుస్తారా
రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియకపోవడం సిగ్గుచేటు
అవినీతి, దోపడీని కప్పిపుచ్చుకునేందుకే సైకిల్‌యాత్ర
ఢిల్లీ: 2014లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే 2019లో టీడీపీకి పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అనిల్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధణ కోసం లోక్‌సభ సభ్యులతో రాజీనామాలు చేయిస్తామని పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, చెప్పిన మాట ప్రకారం ఎంపీలంతా రాజీనామాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా నినాదంతో మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్తామన్నారు. రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించొచ్చు అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో జరగవనే విషయం కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నాడని ప్రశ్నించారు. 

ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఏదో చక్రతిప్పుతా అని మాట్లాడి.. ఆంధ్రుల పరువును పార్లమెంట్‌ మెట్ల వద్ద ఫొటోలకు ఫోజులు ఇచ్చి మంటగలిపాడని మండిపడ్డారు. హెమాహెమీలను కలుస్తానని చెప్పి హేమామాలినిని కలిశాడని ఎద్దేవా చేశారు. సాధాసీదా ఎంపీలను కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఢిల్లీలో చించేశానని మాట్లాడుతున్నాడన్నారు. వాస్తవానికి 30వ సారి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు రెండు లడ్లు, ఒక శాలువా తెచ్చి చలమేశ్వరరావుకు ఇచ్చారని, గత 29 సార్లు కూడా ఇలాగే చేశారన్నారు. 

ఆంధ్రరాష్ట్రానికి చంద్రబాబు గజినీ మహ్మద్‌లా తయారయ్యాడని ఎమ్మెల్యే అని ఆరోపించారు. హోదా కోసం పోరాటం చేయకుండా దిక్కుమాలిన డ్రామాలు ఆడుతున్నాడన్నారు. చిత్తశుద్ధి ఉంటే పోరాటం చేయాలన్నారు. చంద్రబాబు తన చేతగానితనం, అవినీతి, దోపిడీ కప్పిపుచ్చుకునేందుకు సైకిల్‌యాత్ర చేపడుతున్నాడన్నారు. రాజీనామాలు చేస్తే ఎవరు పోరాడుతారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం పళనిస్వామిని కలిసి ఏఐడీఎంకే నేతల నిరసనను రెండ్రోజులు వాయిదా వేయాలని కోరలేని చేతగాని వ్యక్తి చంద్రబాబు అన్నారు. 12 సార్లు అవిశ్వాస తీర్మానం ఇస్తే చర్చ జరగనప్పుడు ఇంకా ఎలా పోరాడుతారని ప్రశ్నించారు. పూటకో వేషం వేసుకుంటూ.. ప్రజలను మభ్యపెట్టడం తగదని, టీడీపీని ఇంటికే పరిమితం చేసేందుకు ప్రజలు వేచిచూస్తున్నారన్నారు. 
 
Back to Top