అనుమ‌తి లేకుండా కాలేజీలు నడుతుపుతున్న మంత్రి నారాయణ
నెల్లూరు: అనుమతి లేకుండా ఎనిమిది నారాయణ కాలేజీలు నడుస్తున్నాయని, ఈ విషయాన్ని ఇంటర్‌ బోర్డు అధికారులే ధ్రువీకరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. దీనిపై మంత్రి నారాయణ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం కనీస విచారణ కూడా చేపట్టడం లేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలను మంత్రి నారాయణ కనీసం పరామర్శించిన దాఖలాలు కూడా లేవన్నారు. అనుమతులు లేకుండా కళాశాలలు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో మంత్రి నారాయణ చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అనుమతులు లేని కళాశాలలను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top