వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే వస్తారు


గుంటూరు: వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడని, ప్రజలను నమ్ముకొని సింగిల్‌గానే వచ్చే ఎన్నికలకు వెళ్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు కలిసి వచ్చినా, విడిగా వచ్చినా సిద్ధమే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ సవాలు విసిరారు. గురువారం గుంటూరులో నిర్వహించిన వంచనపై గర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ రాజకీయాల్లో అడుగుపెట్టగానే దేశంలోని మహామహులు సైతం సోనియాగాంధీని చూసి భయపడుతున్న తరుణంలో కేంద్రాన్నే గడగడలాడించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీలు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వైయస్‌ జగన్‌ను ఏమీ చేయలేరన్నారు. ఎవరు భయపడుతున్నారో, ఎవరు వెన్నుచూపి వెనుతిరుగుతున్నారో రాష్ట్ర ప్రజలే చెబుతారన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద పార్టీ టీడీపీ అని విమర్శించారు. 2019లో వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడిగా ప్రజలను నమ్ముకొని ఒక్కడిగానే ముందుకు వస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు లాగా ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒక్కరితో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతారన్నారు. మగాడు ఒక వైపు ఉన్నాడని, అవతల వైపు ఎంతమంది ఉన్నారో అందరికి తెలుసు అన్నారు. చంద్రబాబు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, లోక్‌సత్తా, సీపీఎం, సీపీఐ ఇలా అన్ని పార్టీలు కట్టకట్టుకొని వచ్చినా..ఒక్కరమే వస్తామని ఛాలెంజ్‌ విసిరారు. 2019లో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని దీమా వ్యక్తం చేశారు.
 
Back to Top