వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా హౌస్ అరెస్టు

కడప) వైఎస్సార్ జిల్లా కడప
నియోజక వర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా ను ప్రభుత్వం హౌస్ అరెస్టు
చేయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకొంటారని ఆరోపిస్తూ
పోలీసు బలగాల్ని ఆయన ఇంటికి పంపించారు. ఆయనను భవంతి నుంచి బయటకు రానీయకుండా అడ్డుకొన్నారు.

వాస్తవానికి వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఉండేది. దివంగత
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని ప్రతిష్టించారు. ఆ విషయాన్ని మనస్సులో
పెట్టుకొని, కలెక్టరేట్ కార్యాలయ పునర్ నిర్మాణం పనుల్లో భాగంగా విగ్రహాన్ని
తొలగించి పక్కన పెట్టేశారు. రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే
ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా అంజాద్ బాషా కోరుతున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో
ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ పని జరగక పోగా,
స్థానిక ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించటం విమర్శలకు దారి తీస్తోంది. 

Back to Top