టీడీపీ నాయకులది దొంగ దీక్షలు


ఎమ్మెల్యే అంజాద్‌బాషా
వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంజాద్‌బాషా విమర్శించారు. రాజంపేట మహాధర్నాలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, ఉక్కు పరిశ్రమ అంటూ ఇవాళ దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. టీడీపీ ఎంపీ ఆమరణ దీక్ష కాదని..కార్పొరేట్‌ దీక్ష అని అభివర్ణించారు. ఈ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి చేస్తే..ఆ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారన్నారు. మరోసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. 
 
Back to Top