ఆంధ్రరాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

చంద్రబాబు పాలనకు రోజులు దగ్గరపడ్డాయ్‌
జననేతను ముఖ్యమంత్రిని చేయాలనే కంకణం కట్టుకున్నారు
వందల హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని టీడీపీ
విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో అడుగుపెట్టారు. జననేత పాదయాత్రకు విశాఖవాసుల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని అర్థం అవుతుందన్నారు.గత ఎన్నికల సమయంలో వందల కొద్ది హామీలిచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. 600ల హామీల్లో ఒక్కటి నెరవేర్చిన దాఖళాలు లేవన్నారు. రైతులకు రుణమాఫీ, బ్యాంక్‌లో ఉన్న బంగారం ఇంటికి తెచ్చి ఇస్తానని నమ్మబలికి మోసం చేశాడని మండిపడ్డారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులను నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం ద్వారా అనేక మంది నిరుపేదలు ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివినా.. చంద్రబాబు ఉపాధి కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం.. నిరుద్యోగ భృతి అని చెప్పి మోసం చేశాడని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖళాలు లేవన్నారు. ఎన్నికలు ఆరు నెలల్లో ఉన్నాయనగా.. నిరుద్యోగ భృతి పేరుతో ఎన్నికల భృతి ఇస్తున్నాడని ఆరోపించారు. పాదయాత్రగా ప్రజల్లోకి వస్తున్న వైయస్‌ జగన్‌కు జిల్లా జిల్లాకు ప్రజల ఆదరణ పెరిగిపోతుందని, అన్నివర్గాల ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారన్నారు. 
Back to Top