టీడీపీ నేతలవి దొంగ దీక్షలు


వైయస్‌ఆర్‌: కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు చేస్తున్నది దొంగ దీక్షలని వైనయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా విమర్శించారు. కడప స్టీల్‌ పరిశ్రమ సాధనకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్షకు అంజాద్‌బాషా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కడప ఉక్కు పరిశ్రమ కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి చేస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సేల్‌ ఆధ్వర్యంలో కడపలో క్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేసిందని గుర్తు చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ పనులు అడ్డుకున్న వారే ఇవాళ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

టీడీపీ ఏ రోజు మాట్లాడలేదు: మేయర్‌ సురేష్‌బాబు
కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని ఏ రోజు కూడా టీడీపీ నాయకులు మాట్లాడిన దాఖలాలు లేవని కడప మేయర్‌ సురేష్‌బాబు విమర్శించారు. ఇవాళ ఎన్నికల కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 
 
Back to Top