సీఎం రమేష్‌ది దొంగ‌ దీక్ష


వైయ‌స్ఆర్ జిల్లా:  నాలుగేళ్లుగా క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే..బీజేపీ, టీడీపీలు క‌లిసి కాపురం చేసి ఏ నాడు కూడా ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం గ‌ళం విప్ప‌లేద‌ని, ఇవాళ సీఎం ర‌మేష్ దొంగ దీక్ష చేస్తున్నార‌ని ఎమ్మెల్యే అంజాద్ బాషా విమ‌ర్శించారు. బుధ‌వారం క‌డ‌ప‌లో చేప‌ట్టిన ర‌హ‌దారుల దిగ్బంధం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. ఆ నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తలపెట్టిన స్టీల్‌ ప్లాంట్‌ అడ్డుకోకుండా ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని  అన్నారు. నాలుగేళ్లు నోరు మెద‌ప‌ని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ రోజుకు రూ. కోటి ఖర్చు పెట్టి దీక్ష చేస్తున్నారని..అది కార్పొరేట్‌ దీక్ష అని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్‌ తప్పా​ ఎవరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైయ‌స్ఆర్‌సీపీ జతకట్టే ప్రసక్తే లేదన్నారు. కొద్ది రోజుల్లో మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. టీడీపీకి ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం ఉద్య‌మిస్తున్న నాయ‌కుల‌ను అరెస్టు చేయ‌డం దుర్మార్గ‌మ‌న్నారు.
Back to Top