ప‌ద‌వులు ముఖ్యం కాదు


విశాఖ‌: త‌మ‌కు ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని ఎమ్మెల్యే అంజాద్‌బాషా పేర్కొన్నారు. విశాఖ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. వైయ‌స్ఆర్‌సీపీకి రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం, తమకు పదవులు ముఖ్యం కాదు అని పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షలు చేసిన ఐదుగురు పార్లమెంట్‌ సభ్యలు ప్రజల హృదయాలలో నిలిచిపోతారన్నారు.  ఈ రోజు రాష్ట్రంలో దుర్మార్గ, రాక్షస పాలన కొనసాగుతోంద‌ని మండిప‌డ్డారు. నరేంద్రమోది, చంద్రబాబులు తిరుపతి వేదికగా హామీ ఇచ్చి మాట త‌ప్పార‌న్నారు. 
Back to Top