ప్రజాక్షేత్రంలో బాబు అవినీతిని ప్రశ్నిస్తున్నాం

విజయవాడ: చంద్రబాబు అవినీతిని ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీపై గెలిచిన వారిని చంద్రబాబు కొనుగోలు చేశారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో ఉన్న ఏపీలో రూ.6 వేల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుబారా చేశారన్నారు. ఎమ్మెల్యేలకు జీతం ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు.  దుబాయిలో గంట కొట్టేందుకు వెళ్లిన చంద్రబాబు రూ.1.50 కోట్లు ఖర్చు చేశారని, టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి నొప్పి చికిత్సకు సింగపూర్‌లో వైద్యం చేయించి రూ.2.88 లక్షలు వెచ్చించారని తప్పుపట్టారు. 
 
Back to Top